భారీ అంచనాల నడుమ విడుదల అయిన కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక స్టార్ హీరోలు నటించిన ఆ మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఎంతోమంది కోట్లు వెచ్చించి మరి సినిమాలను కొనుగోలు చేసి నష్టపోయిన వారు అనేక మంది ఉన్నారు. కానీ అలాంటి సినిమాలు ద్వారానే కోట్లలో డబ్బులు సంపాదించిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతను ఎవరు .? ఏం జరిగింది .? అనే వివరాలు తెలుసుకుందాం.

ఒకప్పుడు తెలుగు సినిమాలు ఎక్కువ శాతం తెలుగులో మాత్రమే విడుదల అవుతూ ఉండేవి. ఎక్కువగా హిందీలో విడుదల అయ్యేవి కావు. ఇలాంటి అంశాన్ని మనీష్ షా చాలా బాగా యూస్ చేసుకున్నాడు. మరి ఆయన ఎలా సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్ ఫ్లాప్ మూవీల ద్వారా ఎలా కోట్లు సంపాదించాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రపంచం లోనే అతిపెద్ద యూట్యూబ్ చానల్స్ లో గోల్డ్ మైన్స్ ఛానల్ పదవ స్థానంలో ఉంది. ఈ ఛానల్ కు పది కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఏడాదికి 400 కోట్ల రెవెన్యూ వరకు దీనికి వస్తుంది. ఇకపోతే ఈయన టాలీవుడ్ లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకొని సినిమాలను హిందీలో డబ్ చేసి ఆ మూవీల ద్వారా కోట్లలో డబ్బులు సంపాదించాడు. 

మొదటగా ఈయన 2004 వ సంవత్సరం విడుదల అయిన మాస్ మూవీని కేవలం 7 లక్షల కొని మేరీ జంగ్ పేరుతో డబ్బింగ్ చేస్తే ఈ మూవీ ద్వారా కోట్ల రూపాయలు ఆయనకు వచ్చాయి. అలాగే వరుడు సినిమాను 10 లక్షలకు కొనుగోలు చేస్తే దాదాపు ఈ మూవీ ద్వారా 20 కోట్లకు పైగా డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. శక్తి మూవీ ద్వారా కూడా ఈయన కోట్లలో డబ్బులు సంపాదించినట్లు తెలుస్తుంది. ఇలా ఎన్నో టాలీవుడ్ ఫ్లాప్ మూవీలను ఈయన కొనుగోలు చేసి డబ్బింగ్ చేసి విడుదల చేసి అద్భుతమైన స్థాయిలో డబ్బులను సంపాదించాడు. అలా వైకుంఠపురంలో , జెర్సీ లాంటి సినిమాలు రీమిక్ చేసిన హిందీలో ఆడక పోవడానికి ప్రధాన కారణం అప్పటికే ఆ సినిమాలు డబ్బింగులు ప్రేక్షకులు చూసేయడమే అనే లాజిక్ ను కూడా చెబుతూ వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: