అంత మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా 90 లలో ఎన్టీఆర్ గారు నాకు మాత్రమే ఫోన్ చేసి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానించిన క్షణమే నేను ఎన్టీఆర్ గారితో కలిసి రాజకీయాల్లో ఉండాలని అనుకున్నాను అప్పట్లో నా కెరియర్ మంచి పిక్ స్టేజ్ లో ఉంది .. బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. నిర్మాతలు కూడా కొందరు నన్ను హెచ్చరించి రాజకీయాల్లోకి వెళ్తే కెరియర్ మొత్తం నాశనం అవుతుంది.. ఎన్నో ఇబ్బందులు వస్తాయని కూడా హెచ్చరించారు. కానీ నేను అవన్నీ ఆలోచించలేదు ఎన్టీఆర్ పిలుపుతో 1994లో తెలుగుదేశం పార్టీలో చేరానును. అలాగే ఎన్టీఆర్ గారు కూడా నాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో జయప్రద టిడిపి కోసం అప్పట్లో ప్రచారం కూడా చేసింది.
ఇక తర్వాత టిడిపి ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత .. కొంతకాలానికి టిడిపి చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో పార్టీ ని ప్రభుత్వాన్ని కాపాడటం కోసం నేను చంద్రబాబుకు సపోర్ట్ చేశాను. ఇది నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే. ఎలాంటి ఇబ్బంది వచ్చిన ఆ సమయంలో నేను ఎన్టీఆర్ వైపు ఉండి ఉండాల్సింది.. ఆ విషయంలో ఇప్పటికీ నేను బాధపడుతున్నానని జయప్రద ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మాటని పాటిస్తాను అని బాగా నమ్మకం. నా మీద నమ్మకంతో అనేక బాధ్యతలు ఇచ్చారు. వాటన్నింటినీ నెరవేర్చాను. కానీ చివరి రోజుల్లో ఆయన వైపు ఉండలేకపోయాను అని జయప్రద ఫీల్ అయ్యారు.