సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా మంది దర్శకులు , నిర్మాతలు స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎగబడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం వారు నటించిన సినిమాలలో నుండి కంటెంట్ ఏ మాత్రం బయటకు రాకపోయినా ఫలానా హీరో నటిస్తున్నాడు అంటే చాలు ఆ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో క్రేజ్ వాస్తు ఉంటుంది. బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక సినిమాకు గనక హిట్ టాక్ వచ్చినట్లయితే కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక కొంత మంది హీరోలు తాము నటించిన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను బాక్స్ ఆఫర్స్ దగ్గర రాబడుతూ ఉంటారు.

ఇక ఈ సంవత్సరం నెగటివ్ టాక్ తో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసిన స్టార్ హీరోల లిస్టులో విజయ్ , తారక్ చేరిపోయారు. అసలు విషయంలోకి వెళితే ... తలపతి విజయ్ ఈ సంవత్సరం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయదు. భారీ ఫ్లాప్ ను అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే కాస్త నెగటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కి పెద్ద అపజయం వస్తుంది అని కొంత మంది భావించారు. కానీ ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. అలా ఈ ఇద్దరు హీరోలు నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలతో సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి తమ స్టామినా ఏమిటో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: