సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఒక కన్ను.. ఏఎన్ఆర్ అంటే మరొక కన్ను ..ఇలాగే చెప్పుకునే వారు జనాలు. ఇప్పటిలా పాన్ ఇండియా హీరోలు స్టార్ స్టేటస్ టైర్ 2 హీరోలు ఇలా ఏదీ లేదు హీరో అంటే హీరోనే. అది చిన్న హీరో కాదు పెద్ద హీరో కాదు . ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం ప్రాణం పెట్టి నటించేవారు.  తెలుగు సినిమా తమిళ్ సినిమా అని కాకుండా ఇది సినిమా ఇండస్ట్రీ అనే రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తూ అలాంటి సినిమాలో నటిస్తూ చాలా చాలా క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్నారు .


అయితే తెలుగు ఇండస్ట్రీ అంటే మాత్రం అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ . ఇద్దరూ రెండు భుజాలపై సినిమా ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చారు అని చెప్పుకోక తప్పదు .  ఏఎన్ఆర్ చాలా రొమాంటిక్ హీరో . అందరూ ఇదే అప్పట్లో ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళు . మరి ముఖ్యంగా ఏఎన్నార్ - శ్రీదేవిల మధ్య రొమాంటిక్ సీన్స్ ఎంత హైలెట్గా పండుతాయో అందరికీ బాగా తెలిసిన విషయమే.  కాగా ఏఎన్నార్ యంగ్ ఏజ్ లోనే కాదు ముసలి వయసులోనూ హీరోయిన్స్ తో సరదాగా స్టెప్స్ వేయాలి అని ఆశపడ్డారు. ఒకానొక ఈవెంట్లో హీరోయిన్ త్రిషతో నాకు స్టెప్స్ వేయాలని ఉంది అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చాడు. అప్పుడు పక్కనే ఉన్న నాగార్జున సైతం నవ్వుకున్నాడు.



"నువ్వొస్తానంటే నేనొద్దంటానా" సినిమాలోని పాట పాడుతూ ఇప్పుడైనా సరే త్రిష పిలిస్తే నువ్వొస్తానంటే నేనొద్దంటానా స్టెప్స్ ఈజీగా వేసేయగలను ..ఆమెతో నటించగలను అంటూ స్టేజిపై చమత్కరించారు. మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అయితే త్రిషతో స్టెప్స్ వేయకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు . నిజానికి మనం సినిమాలో శ్రేయ శరణ్ పాత్రలో ముందుగా త్రిష హీరోయిన్గా అనుకున్నారట . కానీ త్రిష సినిమాలు చేయడానికి ఇష్టం చూపించకపోవడంతో ఆ పాత్ర శ్రేయ కి చేరింది. ఒకవేళ ఆ సినిమాలో గనక త్రిష నటించి ఉంటే ఏఎన్ఆర్ కోరిక కూడా తీరిపోయి ఉండేది . జస్ట్ మిస్
 అంటూ కౌంటర్స్ వేస్తున్నారు ఆకతాయిలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

ANR