నాగార్జున కొడుకు పెళ్లి ని బాగా సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నాడు . అందుకే అక్కినేని ఫ్యామిలీ నో చెబుతున్నా కూడా కొన్ని కొన్ని విషయాలలో బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాడు . ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువుగా ట్రెండ్ అవుతూ వినిపిస్తున్న పేర్లు నాగచైథన్య-శోభిత ధూళిపాళ్ల. మనకు తెలిసిందే త్వరలోనే శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య పెళ్లి ఘనంగా జరగబోతుంది . ఇన్ సైడ్ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేశారట అక్కినేని ఫ్యామిలీ .


అంతేకాదు నాగేశ్వరరావు గారి ఆశీస్సులు అందుతాయి అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల.   కాగా డిసెంబర్ 2వ తేదీ మెహందీ ..మూడవ తేదీ సంగీత్.. నాలుగవ తేదీ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది . ఈ పెళ్లి కి టాలీవుడ్ ప్రముఖులతో పాటు పొలిటీషియన్స్ ని కూడా ఇన్వైట్ చేయబోతున్నాడట అక్కినేని నాగార్జున. కాగా ఈ సంగీత్ వేడుకలో పలువురు స్టార్ హీరోస్ అలాగే హీరోయిన్స్ చేత్ స్టెప్పులు వేయించబోతున్నాడట నాగార్జున.



గతంలో ఆయన నటించిన "కింగ్" సినిమాలో ఒక సాంగ్ లో అందరి హీరోయిన్స్ ఎంట్రీస్ తో  స్టెప్స్ వేస్తారు. తరరంపంపం..అంటూ బాగా ఎంజాయ్ చేశారు.  అదే విధంగా నాగార్జున..తన కొడుకు అక్కినేని నాగచైతన్య పెళ్లిలో పలువురు స్టార్ యంగ్ హీరోయిన్స్ చేత అదే విధంగా హీరోస్ చేత స్టెప్స్ వేయించడానికి రెడీ అవుతున్నారట . ఆయనకు బాగా క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ చేత నాగచైతన్య పెళ్లిలో డాన్స్ చేయించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. దీంతో నాగచైతన్య పెళ్లి పై ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: