మాస్ డైరెక్టర్ కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. డైరెక్టర్ గా కెరీర్ స్టార్టింగ్ లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా కొరటాల దూసుకుపోయారు.. అయితే వరుస సినిమాల సక్సెస్ తో జోరు మీద వున్న కొరటాలకు మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు.. చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆచార్య ‘ మూవీ ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో అప్పటి వరకు కొరటాలకు వున్న క్రేజ్ ఒక్కసారిగా మాయమైంది.. కొరటాల కారణంగానే సినిమా ప్లాప్ అయిందంటూ మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేసారు.. ఆచార్యతో డీలా పడ్డ కొరటాల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావించాడు..కొరటాలకు ఎన్టీఆర్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.. తనకి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాలతో ఎన్టీఆర్ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరక్కింది..

 “ దేవర” వంటి మాస్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.. మొదటి ఆటకే ఈ సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు.. కానీ కొన్ని రోజులకు టాక్ మారుతూ వచ్చి ఏకంగా 500 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించింది.. దేవర సినిమా రెండు పార్ట్స్ గా తెరకెక్కింది.. మొదటి పార్ట్ తాజాగా రిలీజ్ అయింది.. రెండో పార్ట్ త్వరలోనే మొదలు కానుంది.. ఇదిలా ఉంటే దేవర సినిమాకు మేకర్స్ భారీ కలెక్షన్స్ ఎక్సపెక్ట్ చేసారు.. కానీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.. దీనితో కొరటాల తన తరువాత సినిమా కోసం స్టార్ హీరోల డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూడాల్సి వస్తుంది..ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరు వరుస సినిమాలతో బిజీగా వున్నారు.. దీనితో కొరటాల తన తరువాత సినిమా ఎవరితో చేస్తారు అనేది ప్రశ్నగా మారింది..కెరీర్ స్టార్టింగ్ లో అదిరిపోయే మూవీస్ తీసిన కొరటాల ప్రస్తుతం తన కథలలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: