మన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్ల వచ్చి స్టార్ హీరోయిన్లుగా రాణించినవారు ఉన్నారు. అలా హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అయితే మన చిత్ర పరిశ్రమలో 40 సంవత్సరాలు దాటుతున్న కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరు అనేది ఇక్కడ చూద్దాం. ముందుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాగే ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చుకుంది.


ప్రస్తుతం సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న ఘాటీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉంది. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా 43 సంవత్సరాలు దాటుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. మరో స్టార్ హీరోయిన్ త్రిష కూడా తెలుగు - తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే 40 సంవత్సరాలు దాటుతున్న కూడా హీరోయిన్గా సినిమాలు చేస్తూ  ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. త్రిష కూడా 41 సంవత్సరాలు దాటుతున్న పెళ్లి ఊసు లేకుండా ఒంటరిగానే ఉంటుంది. మరో సీనియర్ బోల్డ్ హీరోయిన్ కిరణ్ కూడా సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.


ఇక ఈమె కూడా 40 సంవత్సరాలు దాటుతున్న పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటుంది. ఒక్క‌ప‌టి స్టార్ హీరోయిన్ టబు గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ డ్యూటీ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ సింగిల్ గాని తన లైఫ్ని కొనసాగిస్తుంది.  90 లలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అంద చందాలతో ఉర్రూతలూగించిన సీనియర్ హీరోయిన్ నగ్మా కూడా 50 సంవత్సరాలు దాటుతున్న కూడా పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటుంది. మరో సీనియర్ హీరోయిన్ సదా కూడా నాలుగు పదుల వయసు దాటుతున్న కూడా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: