టాలీవుడ్ లెక్కల సుకుమార్ మాస్టర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 5న ప్రేక్షకు ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప 2 పై ఎవరు ఊహించని రేంజ్ లో ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్ సినిమాని భారీ స్థాయిలోనే తెర్కక్కించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దిరోజులు సమయం మాత్రమే ఉంది.


ఈ సినిమాకు సంబంధించిన టైలర్ కూడా లాక్ అయిందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గాా మారింది. నిజానికి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు .. భారీ రెమ్యూనేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉన్నారు. ఇక ఆయన చివరి సినిమాకి 275 కోట్లకు పైగా పారితోషకం అందుకున్నాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా భారీ గానే రెమ్యూనిరేషన్ అందుకు అంటున్నాడు. పుష్ప సినిమా గాను బన్నీ 300 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.


అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ దీటుగా విలన్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కేవలం 8 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా అందుకున్నాడని తెలుస్తుంది.  300 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో అల్లు అర్జున్ అత్యధిక పారితోషిక అందుకుంటున్న పాన్ ఇండియా హీరోగా నిలిచినట్టు  పలు నివేదికలు చెబుతున్నాయి. అలాగే సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన కేవలం 10 కోట్లు అందుకుంటున్నట్టు తెలుస్తుంది.  పుష్ప దెబ్బతో రష్మిక రేంజ్ మారిపోయింది. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీమణుల సరసన చేరింది. నయనతార, దీపికా పదుకొణె, అలియా భట్, కరీనా కపూర్‌తో సహా పలువురు నటీమణులు ఈ జాబితాలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: