కాగా ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు. మరీ ముఖ్యంగా ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ కు ఎలాంటి సహాయమైనా చేస్తూ ఉంటారు. బయట వాళ్లకే సహాయం చేసే ప్రభాస్ ప్రాణ స్నేహితుడికి సహాయం చేయడా అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ తన క్లోజ్ ఫ్రెండ్ అయినా తెలుగు హీరోకి పది కోట్లు అప్పుగా ఇచ్చాడు అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ అప్పును ఆ హీరో అడగను లేదు ..ప్రభాస్ అప్పుగా ఇవ్వనూ లేదు.. కేవలం ఫ్రెండ్షిప్ కారణంగానే ఆయన హెల్ప్ చేశాడు .
అయితే ఉత్తినే ఎవరు రూపాయి కూడా తీసుకోరు . ఆ కారణంగానే ప్రభాస్ అప్పుగా తీసుకో అంటూ 10 కోట్లు ఆయన ఫ్రెండ్ అయిన హీరో కష్టంలో ఉన్నప్పుడు ఆయనకు సహాయం చేశారట. అంత మంచి స్టార్ హీరో మన ప్రభాస్ . అయితే ఆ స్టార్ హీరో ఎన్నిసార్లు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని చూస్తున్నా కూడా ప్రభాస్ ఫ్రెండ్షిప్ పేరుతో అలా ఇలా తప్పించుకుంటూనే వస్తున్నారట. అప్పుగా ఇచ్చానే కానీ ఆ అప్పు నేను తిరిగి తీసుకోవడానికి కానేకాదు ..ఇది ఫ్రెండ్షిప్ అప్పు.. ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు అప్పు క్లియర్ కాకూడదు అంటూ సరదాగా హీరోతో పదికోట్ల విషయాన్ని చాలా కూల్ గా పక్కకు పెట్టించేస్తున్నాడట. పది కోట్లు అంటే మామూలు విషయం కాదు . ప్రభాస్ స్నేహం కోసం ఏమైనా చేస్తాడు అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు రెబెల్ ఫాన్స్ . ఇప్పుడు ఆ హీరో పేరుని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు రెబెల్ అభిమానులు..!!