ఇక మన తెలుగులో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన కెరియర్ లో 500 పైగా సినిమాలో నటించారు. విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హిరోగా దర్శకుడుగా నిర్మాతగా ఎన్నో పాత్రలు నటించి మెప్పించారు. మోహన్ బాబు తన మనసులో ఏది అనుకుంటే అది కరెక్ట్ గా పైకి చెప్పేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో చాలామంది సైతం మోహన్ బాబును అసలు పట్టించుకోరు. అయితే అయన కెరీర్‌లో వరస ప్లాప్‌ల్లో ఉన్న మోహన బాబు ఆ సమయంలో కే రాఘవేందర్రావును ఒక సినిమా చేసి పెట్టాలని అడిగారు.
చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాఘవేంద్రరావు తన తర్వాత సినిమాను మోహన్ బాబుతో ఎందుకు చేశారు ? పైగా రీమేక్ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది . అసలు విషయంలోకి వెళ్తే రాఘవేందర్రావు మోహన బాబుతో అల్లుడుగారు అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మోహన్ బాబు కెరీర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ముందు ఈ మూవీ ని మోహన్ బాబు కాకుండా బాలయ్య తో చేద్దామని అనుకున్నారు కానీ బాలయ్య ఆ సినిమాని వదులుకున్నారు అప్పట్లో 300 రోజులు సినిమా ఆడింది మోహన్ బాబు సినిమా కెరియర్ లో బెస్ట్ సినిమాగా మిగిలిపోయింది.