సినిమాల్లో ఆమె నటించే పాత్రకు ఆమె డెడికేషన్ ఓ రేంజ్ లో ఉండేది ఎంతో సహనంతో ఓర్పుతో ఆమె సినిమాల్లో నటించేది . ఇక సౌందర్య అప్పట్లో కన్నడ లో ఒక స్టార్ హీరో సినిమా లో నటించింది . అయితే ఆ సినిమా షూటింగ్లో ఆ స్టార్ హీరో కి సంబంధించిన డేట్స్ తక్కువగా ఉండటం వలన షూటింగ్ ఎక్కువ సమయం చేయాల్సి వచ్చేది . డైరెక్టర్ కూడా ఒక్కో షాట్ కి పది టేకులు తక్కువ కాకుండా తీసుకునే వాడట . ఉదయం ఏడు గంటలకి షూటింగ్ కి వస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు షూటింగ్ జరిగేదట .
అయితే సౌందర్య కి పగలు నిద్రపోయే అలవాటు లేకపోయే సరికి ఎంత నిద్రపోవాలని చూసిన నిద్ర పట్టేది కాదట .. అప్పుడు సౌందర్య కి నిద్రలేమి సమస్య వచ్చింది .. ఆ సమయంలో ఆమె నిద్రపోవడం కోసం తక్కువ మోతాదు లో నిద్ర మాత్ర లు వేసుకుని నిద్రపోయేదట .. మళ్లీ వెంటనే నిద్ర నుంచి షూటింగ్ కి వెళ్ళలేదట షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు సౌందర్య ఎంతో టార్చర్ చూసిందట .