ఏకంగా ఇతర దేశాల పండుగలను అటు భారత్లో సెలబ్రేట్ చేసుకోవడం చూస్తున్నాం. అంతేకాదు అక్కడి అలవాట్లను ఇక్కడ రుద్దుతూ ఉన్నారు. ఇలాంటి అలవాట్లలో సహజీవనం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే భారత సంప్రదాయం ప్రకారం కాకుండా పెళ్లి కాకముందే ఒక యువతి యువకుడు ఒకే చోట భార్య భర్తలుగా జీవించి శారీరక మానసిక సంబంధాలను కలిగి ఉండి.. ఆ తర్వాత ఇష్టమైతే పెళ్లి చేసుకోవడం కష్టమైతే విడిపోవడం చేయడమే ఈ సహజీవనం వెనుక ఉన్న అసలు అర్థం. అయితే ఈ మధ్యకాలంలో ఇండియాలో కూడా ఈ సహజీవనంకి ఆకర్షితులు అవుతున్న వారు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.
ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్స్ పై హీరో విక్రాంత్ మాసే చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇందుకు సహజీవనం తనకు చాలా ఉపయోగపడింది అంటూ హీరో విక్రమ్ మాసే చెప్పుకొచ్చాడు. తాను ఈ కాన్సెప్ట్ ను ప్రచారం చేయట్లేదని.. కానీ దీని గురించి మాట్లాడటానికి భయమేస్తుంది అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమ ముఖ్యం. నేను నా భార్య డేటింగ్ తో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. అయితే ఇది ప్రతి ఒక్కరి విషయంలో వర్కౌట్ అవుతుంది అని మాత్రం చెప్పలేను అంటూ హీరో విక్రాంత్ మాసే చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.