రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. చరణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు టీజర్ లో ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపుగా 90 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రామ్ చరణ్ రెండు పాత్రలకు సంబంధించిన షాట్స్ టీజర్ లో ఉన్నాయి.
 
టీజర్ లో చరణ్ పాత్రకు సంబంధించి డైలాగ్స్ ఎక్కువగా లేకపోయినా అదిరిపోయే లుక్స్ తో చరణ్ మాత్రం అదరగొట్టారనే చెప్పాలి. దిల్ రాజు ఖర్చు విషయంలో రాజీ పడలేదని టీజర్ చూస్తే అర్థమవుతోంది. శంకర్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలో యాక్షన్ షాట్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
 
ఈ జనరేషన్ ప్రేక్షకులక్ నచ్చే విధంగా మేకర్స్ ఈ సినిమాను ప్లాన్ చేశారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీజర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటం ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ కానుంది. తమిళంలో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. టీజర్ లో విజువల్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాతో సంక్రాంతి బెస్ట్ హిట్ అందుకుంటారేమో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈ సినిమాతో ఫలితం దక్కనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ టీజర్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: