బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ షోలో కమెడియన్స్ బీభత్సమైన పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటారు. అందులో మగవాళ్ళ కంటే ఆడవేషాలు వేసే ఆర్టిస్టులే బాగా నవ్విస్తుంటారు. అచ్చం మహిళల లాగానే వారు చీరలు కట్టుకొని ప్రేక్షకులకు ఎంతో వినోదం పంచుతుంటారు. ఆ లేడీ గెటప్పుల చేసేవారిలో శాంతి స్వరూప్‌, వినోద్‌ బాగా పాపులర్ అయ్యారు జబర్దస్త్ లో కొందరు ట్రాన్స్ జెండర్లు కూడా లేడీ గెటప్స్ వేసుకొని పాపులర్ అయ్యారు. జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్ పింకీ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వారు బాగా డబ్బులు కూడా సంపాదించారు.

ఈ షోతో వచ్చిన పాపులారిటీ కారణంగా ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. అక్కడ కూడా ఆమె బాగానే డబ్బులు సంపాదించింది. ఇక లేడీ కంటెస్టెంట్స్ లో సత్య శ్రీ సైతం బాగా క్లిక్ అయింది. సత్య శ్రీ అమ్మాయే. అయినా సరే ఈ జబర్దస్త్ షోలో బాగా ఇమిడిపోయింది. ఈ అందాల తార ఎక్కువగా చమ్మక్ చంద్ర స్కిట్లలో కామెడీ చేస్తూ అలరించేది. జబర్దస్త్ షో తర్వాత పలు షోస్ కూడా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

ఇకపోతే జబర్దస్త్ షోలో సత్య శ్రీ కట్టిన ప్రతి ఒక్క చీర కూడా సూపర్ హిట్ అయింది. తన చీరకట్టుకు ఫ్యాన్స్ ఉన్నారని ఒకానొక సమయంలో ఆమె చెప్పింది. తాను కట్టుకున్న చీరలు అన్నీ తన తల్లి కట్టుకున్నవే అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు, దాదాపు 500 ఎపిసోడ్ లలో తాను కట్టిన చీరను మరోసారి ధరించలేదని ఆమె చెప్పింది. అంటే ఏకంగా 500 సారీలు ఆమె కట్టుకుంది. అయితే మిగతా వారు మాత్రం షో నిర్వాహకులు ఇచ్చిన చీరలనే ఎక్కువ స్కిట్లలో మార్చి మార్చి ధరిస్తారని చెప్పింది. కానీ సత్య శ్రీ మాత్రం అన్నీ కొత్త శారీ లే కట్టుకుంది వాటిని మిగతా లేడీ గెటప్లు కట్టుకున్నారు అలా వృధా చేయకుండా వాటిని వాడేసారు. చమ్మక్ చంద్ర వెళ్ళిపోయిన తర్వాత సత్య శ్రీ ఇప్పుడు జబర్దస్త్ షోలో కనిపిస్తుందో లేదో కానీ శాంతి స్వరూప్‌ మాత్రం లేడీ గెటప్‌లో ఈ షోలో నాటుకు పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: