బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నది హీరోయిన్ కంగనా రనౌత్. ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయంగా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె ఇంటి నుంచి ఒక విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ మరణించినట్లుగా కంగనా రనౌత్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి తన అమ్మమ్మ మరణించినట్లు అందులో తెలిపింది. ఈ విషయాన్ని ఆమె అభిమానులకు శనివారం రోజున తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిపారు కంగనా రనౌత్.


కంగనా ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన మొదటి కథనంలో.. తన అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ తో కలిసి బిగ్గరగా నవ్వుతూ కనిపించిన ఫోటోని షేర్ చేశారు. నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాగూర్ గారు స్వర్గస్తులయ్యారు. మా కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది దయచేసి వారి కోసం ప్రార్థనలు చేయండి అంటూ పోస్ట్ షేర్ చేసింది కంగానా రనౌత్. అయితే ఈమెకు 5 మంది పిల్లలు ఉన్నారని ఈమె ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ కూడా తన పిల్లలందరిని మంచి విద్యాసంస్థలలో ఉన్నత చదువులను చదివించింది అంటూ తెలిపింది.


వివాహం తర్వాత తన కుమార్తెలు తన పని చేయాలని.. వారి యొక్క సొంత వృత్తిని కలిగి ఉండాలని చూసేదట అలా కుమార్తెలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభించాయట ఆ రోజుల్లో ఇది ఒక అరుదైన విజయమని కూడా తెలిపింది. అలా ఆమె ఐదు మంది పిల్లలు కూడా ఇప్పుడు స్థిరపడిపోయారని రాసుకొచ్చింది కంగనా రనౌత్. ఇంద్రాణి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మరణించినట్లుగా తన అమ్మమ్మ గురించి రాసుకొచ్చింది కంగనా. ఈ విషయం తెలిసిన అభిమానులు కంగనా రనౌత్ అమ్మమ్మ మృతి పట్ల పలువురు సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: