టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు పొలిటికల్గా ఎంట్రి ఇచ్చిన తర్వాత.. మరింత పాపులారిటీ అందుకున్నారు.. ఒకవైపు సినిమాలు మరొకవైపు పొలిటికల్ పరంగా బిజీగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కువగా పొలిటికల్ వైపే మక్కువ చూపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మొట్టమొదట తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత ఆ డబ్బుతో ఏం చేశారు అనే విషయం పైన ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.


సినీ ఇండస్ట్రీలోకి చిరంజీవి తమ్ముడుగా తన కెరీర్ ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ప్రతిభ గుర్తింపు సంపాదించుకొని అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా పేరు పొందారు.. తమ్ముడు, బద్రి, ఖుషి వంటి చిత్రాలతో తన రేంజ్ ని మార్చుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఈవివి దర్శకత్వంలో వచ్చింది. ఈ చిత్రానికి హీరోయిన్ గా నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నటించారు.


ఈ చిత్రాన్ని హిందీ సినిమాకు రీమేక్ గా తిరగకెక్కించారట అప్పట్లో మిశ్రమ స్పందన వచ్చిన ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించారట. మొట్టమొదట పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ 50 వేల రూపాయలట. ఈ డబ్బులు తీసుకువెళ్లి తన వదినమ్మ , అన్న చిరంజీవికి ఇచ్చారట. అయితే పవన్ కళ్యాణ్సినిమా కోసం నెల నెల 5000 రూపాయల చొప్పున తీసుకున్నారట అలా పది నెలలకు 50 వేల రూపాయలు అందుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఒక్కో సినిమాకి రోజుకి రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: