ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. ఏ హీరో కూడా పరాజయాలకు అతీతం కాదు. జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఒకానొక దశలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో  మాట్లాడుతూ నేను టీనేజ్ లో ఉన్న సమయంలో నిన్ను చూడాలని, స్టూడెంట్ నంబర్ 1, సుబ్బు ఇలా వరుస సినిమాలలో నటించానని  తెలిపారు.
 
ఆ సినిమాలు చేయడం వల్ల నా కెరీర్ గ్రాఫ్ పైకెళ్లిందని కొన్నాళ్లకు వైఫల్యాలు ఎదురయ్యాయని ఆ సమయంలో నేను చాలా ఒత్తిడికి లోనయ్యానని తారక్ అన్నారు. వరుస ఫ్లాపుల వల్ల చాలా గందరగోళంగా అనిపించేదని తారక్ చెప్పుకొచ్చారు. నేనెంచుకునే పాత్రలు సరైనవేనా అని అనిపించేదని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఏం చేయాలో నాకు తెలిసేది కాదని తారక్ పేర్కొన్నారు.
 
ఆ సమయంలో జక్కన్న నా యాక్టింగ్ ను సమీక్షించుకోవాలని సూచనలు చేశారని తారక్ చెప్పుకొచ్చారు. ఒక డైరెక్టర్ గా కొన్ని సూచనలు సైతం చేశారని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ఆ తర్వాత నా అలోచనా విధానంలో మార్పు వచ్చిందని సినిమాల ఎంపిక సైతం మారిందని తారక్ తెలిపారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త కొత్త ప్రయోగాలు చేశానని తారక్ కామెంట్లు చేశారు.
 
ఆ సినిమాల సక్సెస్ గురించి పక్కన పెడితే ఒక నటుడిగా మంచి పాత్రలు చేశాననే సంతృప్తి నాకు కలిగిందని తారక్ వెల్లడించారు. ఆ దశ నాకు ఎన్నో పాఠాలను నేర్పిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తారక్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్  సక్సెస్ కు ప్రత్యక్షంగా, పరోక్షంగా జక్కన్న కారణమని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: