కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ పైన కూడా అతని దృష్టిని పెట్టింది. హిందీలో కూడా బ్యాక్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఆఫర్స్ ను అందుకుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను శైలజ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ అందాల భామ తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు చేరువైంది.


అనంతరం వరుసగా తెలుగులో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మహానటి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం కైవసం చేసుకుంది. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోలతో ప్రతి ఒక్క హీరో సరసన హీరోయిన్గా నటిస్తూ అవకాశాలను అందుకుంటుంది.


బ్యూటీ బాలీవుడ్ లో నటించిన సినిమాలు ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. కానీ తన నటన చూసిన దర్శక నిర్మాతలు వరుసగా సినిమాల్లో అవకాశాలను ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఇక కీర్తి సురేష్ సినిమాలలో నటించినందుకు భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటుందట. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.


సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోని పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.... తాజాగా కీర్తి సురేష్ ఓ వివాహ వేడుకకు హాజరైంది. అక్కడికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. వీరిద్దరూ కలిసి ఆప్యాయంగా పలకరించున్నారు. తర్వాత వంశీ పైడిపల్లి కీర్తి సురేష్ తో చాలా క్లోజ్ గా ఫోటోలు తీసుకున్నాడు. తన భుజాలపై చేతులు వేసి ఫోటోలు తీసుకున్నాడు. అంతేకాకుండా కీర్తి సురేష్ తలపై కిస్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: