టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ , ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. మహేష్ ఆఖరుగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మహేష్ తన స్టామినాతోనే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రప్పించాడు. దానితో ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక మహేష్ నటించిన చాలా సినిమాలకు యావరేజ్ , బీలో యావరేజ్ , నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

దీనిని బట్టి అర్థం అవుతుంది ఆయన స్టామినా ఏమిటి అనేది. ఇంత గొప్ప స్టామినా ఉన్న మహేష్ బాబు రెండు విషయాలు మాత్రం మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే కాస్త వెనకబడి పోయాడు అనే వాదనను కొంతమంది వినిపిస్తున్నారు. అవి ఏమిటి అనుకుంటున్నారా ..? మహేష్ బాబు ఈ మధ్య కాలంలో డాన్స్ తో ఓ ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతున్నాడు. కానీ ఒకప్పుడు భారీ స్టెప్పులను పెద్దగా వేసేవాడు కాదు. డాన్స్ విషయంలో కాస్త వెనకబడి పోయాడు. ఇక 1 నేనొక్కడినే సినిమా నుండి మహేష్ డాన్స్ ను చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాడు. అప్పటి నుండి సినిమాలో ఏదో ఒక పాటలో మంచి డాన్స్ మూమెంట్లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇలా డాన్స్ విషయంలో చాలా కాలం మహేష్ కాస్త వెనుకబడిపోయాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే మహేష్ సింగిల్ లైనర్స్ చెప్పడంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు.

అతని రేంజ్ లో సింగిల్ లైనర్స్ డైలాగ్స్ అద్భుతంగా చెప్పే ఇతర స్టార్ హీరోలు లేరు అనడంలో కూడా పెద్దగా వెనకాడాల్సిన అవసరం లేదు. కానీ అదే భారీ లెంతీ డైలాగులు చెప్పడంలో మాత్రం మహేష్ కాస్త తేలిపోతూ ఉంటాడు అనే వాదనను అదే సమయంలో కొంత మంది వినిపిస్తూ ఉంటారు. ఈ రెండు విషయాల్లో మహేష్ కాస్త వెనకబడ్డాడు కానీ ఆ రెండు కూడా అదిరిపోయే రేంజ్ లో పర్ఫెక్ట్ గా ఉండి ఉండుంటే మహేష్ కు చిన్న వంక కూడా ఉండేది కాదు అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: