ఐతే జబర్దస్త్ షోకి కమెడియన్స్ తో పాటుగా జడ్జిల సమస్య కూడా ఉందని అర్ధమవుతుంది. నాగ బాబు, రోజా ఇద్దరు చాలా ఏళ్లు జబర్దస్త్ జడ్జిలుగా మెప్పించారు. ఆ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నాక మళ్లీ అలా పర్మినెంట్ జడ్జిలు లేకుండా పోయారు. కృష్ణ భగవాన్, మనో కొంత కాలం చేశారు. ఇంద్రజ కూడా కొన్నాళ్లు జడ్జిగా ఉన్నారు. కానీ వాళ్లెవరు పర్మినెంట్ గా నిలవలేదు.
ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ కొత్త జడ్జిగా శివాజి కనిపిస్తున్నారు. ఐతే ఆయనకు జతగా ఎవరు సెట్ అవ్వట్లేదు. జబర్దస్త్ లో మేల్ ఫిమేల్ యాంకర్ ఉంటే బాగుంటుంది అని వారి ఆలోచన. కానీ శివాజితో ఖుష్బు, లైలా ఇలా జడ్జిలను మారుస్తున్నారు. షోకి పర్మినెంట్ జడ్జి కుదరట్లేదు. మరి ఎందుకు అలా జరుగుతుంది అన్నది తెలియదు కానీ శివాజితో పాటు మరో పర్మినెంట్ జడ్జిని తీసుకుంటే బెటర్ అని అంటున్నారు ఆడియన్స్. మరి జబర్దస్త్ టీం మల్లెమాల టీం ఈ విషయంపై కాస్త గురి పెడితే బాగుంటుంది. షోపై మునుపటి క్రేజ్ ని కొనసాగించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు జబర్దస్త్ టీం. కానీ ఒకటి రెండు స్కిట్స్ తప్ప కమెడియన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోవట్లేదు. జబర్దస్త్ కి పర్మినెంట్ జడ్జిలు వస్తే కొంత సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని ఆడియన్స్ భావిస్తున్నారు.