తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే కానీ ఇండస్ట్రీలో నిలబడటం కష్టమని కొన్ని ఎదురుదెబ్బలు తిన్న తర్వాత అసలు తన టాలెంట్ ఏంటన్నది ప్రూవ్ చేసుకుంటాడు. దానికి రీసెంట్ గా చెప్పాలంటే పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ గా నిలిచాడు కిరణ్ అబ్బవరం. రాజా వారు రాజు గారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం సినిమాలతో సక్సెస్ అందుకుని కెరీర్ ఊపందుకున్న కిరణ్ అబ్బవరం మధ్యలో వినరో భాగ్యము విష్ణు కథ తో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత వరుస మూడు నాలుగు ఫ్లాపులు అందుకున్నాడు.

కిరణ్ అబ్బవరం సినిమా వస్తుంది వెళ్తుంది అన్నట్టుగా అతని గ్రాఫ్ పడిపోయింది. అందుకే తన గ్రాఫ్ తానే పెంచుకోవాలని నిర్ణయించుకుని క లాంటి సినిమా చేశాడు కిరణ్ అబ్బవరం. క సినిమాను ముందు నుంచి బాగా ప్రమోట్ చేసూ వచ్చిన కిరణ్ అందుకు తగినట్టుగానే ఫలితాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.

ఐతే కిరణ్ తను నిలబడతానని చెప్పి మరీ క సినిమా చేశాడు. క లాంటి సినిమా చేశాక కిరణ్ కి మళ్లీ అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఇక్కడే మళ్లీ కిరణ్ తప్పులు చేసే ఛాన్స్ ఉంది. క లాంటి సినిమా తర్వాత తనకు వచ్చిన ఛాన్స్ ల నుంచి సరైన కథల ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత కిరణ్ అబ్బవరంలో ఉంది. లేకపోతే మళ్లీ తను సైడ్ ట్రాక్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కథల ఎంపికలో ఎలాంటి మొహమాటాలు లేకుండా ఉంటే క లాంటి సినిమాలు మరిన్ని చేసే ఛాన్స్ ఉంటుంది. మరి కిరణ్ అబ్బారం క తర్వాత ప్రాజెక్ట్ ఏంటి ఆ సినిమాల పట్ల కిరణ్ ఎలా ఆలోచిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. క ఇచ్చిన బూస్టింగ్ తో కిరణ్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నాడని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: