టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ కు వరుసగా ఫ్లాప్స్ అందుతున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలు విడుదలకు ముందుకు ఒకలా.. రిలీజ్ తర్వాత మరోలా అన్నట్టు పరిస్థితి నెలకొంది.లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కాస్తా క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన పెళ్లి చూపులు సినిమా విజయ్ కు సక్సెస్ అందించింది.ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీతాగోవిందం వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. విజయ్ ను స్టార్ హీరోగా నిలబెట్టాయి. అయితే తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాఫ్ అవుతూనే వచ్చాయి. ఈ క్రమంలో నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి చిత్రాలు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నే ఖుషి,ఫ్యామిలీ స్టార్ సినిమాలు  కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.ఇదిలావుండగా ఆయన పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మరోవైపు ఆయన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతుంటూనే ఉంటాయి.ఇదే క్రమంలో విజయ్ ఎప్పుడూ తన సినిమాలను వినూత్నంగా ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటారు.

అందుకే ఆయన్ని చాలా మంది ఇష్టపడుతారు. కోట్లట్లో అభిమానులు కూడా ఏర్పడ్డారు. అయితే విజయ్ దేవరకొండ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. స్వయంగా ఆయనే చెప్పడం విశేషం.అయితే, విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమా కూడా మాట్లాడారు. ఈ క్రమంలో తనకు ఉన్న ఓ వీక్ నెస్ ను కూడా చెప్పుకొచ్చారు. అయినా ఈ సినిమాతో దుమ్ములేపిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ డబ్బింగ్ విషయంలో కాస్తా సమయం తీసుకుంటానని చెప్పారు. కంటిన్యూగా చెప్పాలంటే కష్టమన్నారు. రెండు గంటలకంటే ఎక్కువగా డబ్బింగ్ చెబితే వాయిస్ లో ఛేంజెస్ వస్తాయని ఆ ఇంటర్వ్యూలో వివరించారు. అర్జున్ రెడ్డికి 40రోజులు డబ్బింగ్ చెప్పారంట. ఇక అందుకే ఆ మూవీలోని ప్రతి డైలాగ్ ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ అయిన విషయం తెలిసిందే.ఇక విజయ్ వాయిస్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. డబ్బింగ్ విషయంలో నిదానంగా చెప్పినా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి చిత్రాల్లో ఆయన మాటలతో ఎంతలా ఆకట్టుకున్నారో తెలిసిందే.దీంతో డబ్బింగ్ విషయం లో బలహీనం గా వున్నారంటు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చిన సినిమాలు పర్వాలేదనుకుంటూ వచ్చాయి.దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ ’VD12‘పై ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: