మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన దైన‌ రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే కాకుండా ఆయనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు .. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా కొత్త అవతారం ఎత్తిన ఆయన తనదైన రీతిలో సినిమాలుకు కమిట్ అవుతూ ముందుకు వెళుతున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన ఈ హీరో గేమ్ ఛెంజర్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన రెండు సినిమాలతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఏకైక‌ హీరోగా రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చేశాడు.  

ఇక అప్పుడే ఆయన వరుసగా మంచి సినిమాలు ఎంచుకుని సూపర్ సక్సెస్ సాధించినట్టు ఉంటే రామ్ చరణ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. అలాగే రామ్ చరణ్ కెరియర్ మొదట్లో ఆయన ఫేస్ మీద ఆయన ఎక్స్ప్రెషన్ కార‌ణంగా నటుడిగా ఆయన అంత బాగా ఎలివేట్ కాలేకపోయాడు. అంతే కాకుండా ఆయనను నెంబర్ వన్ హీరోగా మారటంలో ఆయనకు మైనస్లుగా మారాయి.  ఇక ఎప్పుడైతే ‘రంగస్థలం’ సినిమా వచ్చిందో అప్పటినుంచి నటుడు గానే కాకుండా ఆయన తనకంటు ఒక ఓన్ స్టైల్ లో ఎదిగే ప్రయత్నం చేశాడు. ఆయన సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకు భారీ స్టార్ డమ్ కూడా దక్కింది.


ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి హీరో టాలీవుడ్‌లో ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుతున్న ఈ స్టార్ హీరో నెంబర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. వరుసగా మంచి సక్సెస్ లను సాధించాలి. అలాగే వరుస సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తూ కలెక్షన్లను రప్పించగలిగే కెపాసిటీ ఉండాలి. మరి అలాంటి సక్సెస్ లను సాధించగలిగే కెపాసిటీ రామ్ చరణ్ కి అయితే ఉంది. ఇక మరి రాబోయే రోజుల్లో వరుస‌ సినిమాలతో రామ్ చరణ్ పాన్‌ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: