పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు.ఈ ఏడాది ఆఖరుకు స్పిరిట్ పట్టాలెక్కబోతోంది. ఆ తర్వాత సలార్2, కల్కి2 పట్టాలెక్కుతాయి. సరైన ప్రణాళిక రచించుకొని వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. కృతిసనన్ హీరోయిన్ గా నటించింది సీత పాత్రలో. గ్రాఫిక్స్ చిన్నపిల్లల గ్రాఫిక్స్ లా వాడారంటూ దర్శకుడిపై సినీ ప్రియులంతా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇదిలావుండగా ఇప్పటికే రాజాసాబ్ నుంచి వస్తున్న అప్‌డేట్స్ తో ఫ్యాన్స్  ఖుష్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో హోంబలే ఫిలిమ్స్ తో మూడు ప్రాజెక్టులు ఓకే చేసి.. తన అభిమానులకు ఫుల్ కిక్  ఇచ్చాడు ప్రభాస్. ఇందులో ఒకటి సలార్-2 కాగా మిగిలిన రెండు ప్రాజెక్టులు ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే సలార్-2 షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్లు హోంబలే ఫిలిమ్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేంది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సలార్ కు సీక్వెల్ గా సలార్-2వస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో మూడు చిత్రాల భాగస్వామ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి వర్క్ చేయడం మాకు గర్వకారణం అంటూ హోంబలే ఫిలిమ్స్ తాజాగా అనౌన్స్  చేసిన విషయం తెలిసిందే. అయితే  డీల్ ఎంత అనేది తెలియరాలేదు. 

ఇక ఇండస్ట్రీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రభాస్ తన మూడు సినిమాలు హోంబలే ఫిలిమ్స్‌తో తీసేందుకు ₹600 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కో సినిమాకి 200 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లలో ఒకడిగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 నుంచి 200 కోట్ల మధ్యలోనే ఛార్జ్ చేస్తున్నాడు. హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ తో చేయబోయే మూడు సినిమాలు 2026, 2027, 2028 లో వస్తాయని కూడా కన్ఫర్మ్ చేశారు.ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న ఐదు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా 4 ఏళ్ళల్లోనే ఫినిష్ అవుతాయని తెలుస్తోంది. ఇలా ఫినిష్ చేయాలంటే గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ ని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ఫినిష్ చేసేలానే కనిపిస్తున్నాడు.ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతోమూడు ఓపినింగ్స్ తోనే తిరిగి ఇచ్చేస్తాడులే అని ఇండియా సూపర్‌స్టార్ ఆ మాత్రం ఉంటుందిగా అంటూ కామెంట్స్  పెడుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: