అందువల్లే చిరంజీవి సినిమాలలో డైలాగ్స్ వీలైనంత వరకు సింపుల్ గానే ఉంటాయని చెప్పవచ్చు. అదే సమయంలో చిరంజీవి లుక్స్ విషయంలో సైతం కొన్ని సినిమాలకు సంబంధించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో చిరంజీవి లుక్స్ విషయంలో వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. గ్రాఫిక్స్ లో చిరంజీవిని చూపించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గొప్ప నటుడైనా చిరంజీవికి లుక్స్ విషయంలో విమర్శలు తప్పలేదు. చిరంజీవి విశ్వంభర టీజర్ విషయంలో సైతం వచ్చిన నెగిటివిటీ అంతాఇంతా కాదు. మెగా అభిమానులలో చాలామంది విశ్వంభర టీజర్ అద్భుతంగా అయితే లేదని కామెంట్లు చేశారు. విశ్వంభర టాలీవుడ్ ఇండస్ట్రీలోని అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటనే సంగతి తెలిసిందే.
చిరంజీవి ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి ఇతర భాషలపై సైతం ఫోకస్ పెడుతుండగా విశ్వంభర సినిమాతో ఆ విషయంలో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది. చిరంజీవి, పవన్, చరణ్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో వర్కౌట్ అవుతుందేమో చూడాలి. మెగా మల్టీస్టారర్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు చిరంజీవి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.