టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికి కూడా మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య కొన్ని సంవత్సరాల క్రితం సింహ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ మాస్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... నయనతార , స్నేహ ఉల్లాల్మూవీ లో బాలకృష్ణ కు జోడీగా నటించారు.

ఇకపోతే ఈ సినిమా కంటే ముందు చాలా సంవత్సరాలు బాలయ్య వరుస అపజయాలను ఎదుర్కొంటూ డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ మూవీ వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమాతో ఒక్క సారిగా బాలయ్య ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ సమయం లో ఈ సినిమాను ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ కి మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సినిమాను ఆ సమయంలో దాదాపు 18 కోట్ల రూపాయలతో రూపొందించినట్లు తెలుస్తుంది.

ఇక ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 31 కోట్ల మేర షేర్ కలక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలను మిగిల్చింది. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: