అయితే ఇప్పుడు పుష్ప2 అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.. ఇండియాలో కాదు ఇతర దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా.. తాజా వస్తున్న నివేదల ప్రకారం పుష్ప ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ లో ఇప్పటికే 500 k USD(సుమారు 4 కోట్లు) కలెక్షన్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ మొదలైన కొద్ది రోజుల్లోనే 20వేలకు పైగా టికెట్స్ అమ్ముడు అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కల్కి, త్రిబుల్ ఆర్ , దేవర వంటి పాన్ ఇండియా సినిమాలను దాటేసింది.
మరికొద్ది రోజులను పుష్ప2 షూటింగ్ కంప్లీట్ కానుంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఇక పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్, రష్మిక పలు నగరాల్లో సందడి కూడా చేయనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో, మైత్రీ మూవీస్ నిర్మాత రవిశంకర్, ‘పుష్ప 2’ ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా ₹425 కోట్లు సంపాదించిందని.. థియేట్రికల్ రైట్స్‌తో ₹1000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ₹600 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇలా పుష్ప2 రిలీజ్ కు ముందే అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేస్తుంది .