ఇక ఇప్పుడు తాజా గా సీనియర్ హీరోయిన్ రవళి గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు . ఇక తన అందం , అభినయంతో అప్పట్లో ఎంతో పాపులారిటీని తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ .. తెలుగు , తమిళ , కన్నడ భాషలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది . ప్రధానంగా తెలుగులో శుభాకాంక్షలు , పెళ్లి సందడి సినిమాలతో రవళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోయిన్గా సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయం లోనే రవళి పెళ్లి చేసుకుంది .. ఆ తర్వాత చిత్ర పరిశ్రమ కు పూర్తిగా దూరమైంది ..
2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో సరదాగా గడుపుతుంది. బుల్లితెరపై కూడా నటించకుండా పూర్తిగా చిత్ర పరిశ్రమకు ఈమె దూరంగా ఉంటుంది . రీసెంట్ గా రవళి తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే రవళి పూర్తి మారిపోయింది. గుర్తు పట్టలేనంతలా మారిన రవళిని చూసిన అభిమానులు ఒకింత షాక్ అయ్యారు . ఇండస్ట్రీకి దూరమైన తర్వాత కూడా మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది తారలు ఉన్నారు. మరి రవళి కూడా ఏదో ఒక సమయంలో మళ్లీ ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.