గతంలో నాగచైతన్యతో శోభిత ప్రేమ వివాహారం మీడియాలో వచ్చినప్పటికీ .. వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు కానీ లండన్ లో వారిద్దరూ కలిసి హోటల్లో కనిపించడంతో ఈ వార్త నిజమని అంత అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా రెండు కుటుంబాల అంగీకారంతో చైతు శోభితల నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక రీసెంట్గా శోభితా నివాసంలో హల్ ది వేడుకకు సంబంధించి అలాగే పెళ్లిలో ఉపయోగించే పసుపు దంచుడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా భోభితా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు చైతు , శోభిత పెళ్లికి సంబంధించిన గెస్ట్ ల జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. రెండు కుటుంబాల ఎంతో గోప్యంగా జరిపించే పెళ్లి కోసం సెలెక్టివ్ గా ప్రముఖులను పిలుస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ రెండు కుటుంబ సభ్యులకు అత్యంత క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆహ్వనితుల జాబితాలో ఉన్నారట. అలాగే స్నేహితులు , సన్నిహితులు కూడా ఈ జాబితాలో చేర్చినట్లు తెలుస్తుంది. అలాగే చిత్ర పరిశ్రమ నుంచి చైతు పెళ్లి వేడుకలో దగ్గుబాటి కుటుంబం అలాగే మెగా ఫ్యామిలీ , మహేష్ కుటుంబంలోను ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తుంది . అలాగే బాలీవుడ్ నుంచి అమితాబచ్చన్ , రన్బీర్ ఫ్యామిలీ లకు ఆహ్వానాలు పంపారట . ఇక ఇండస్ట్రీలో రాజమౌళి ఇతర సిని ప్రముఖ దర్శకులు , నిర్మాతలకు కూడా ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారట . అలాగే చైతు శోభితల పెళ్లి డిసెంబర్ 4న ఎంతో ఘనంగా జరిపించేందుకు రెడీ అవుతున్నారు .