కన్నడ భామలకు తెలుగులో ఎప్పుడూ మంచి పాపులరిటీ ఉంటుంది. వాళ్లు చేసే సినిమాలు ఎంపిక చేసుకునే కథలే వారికి ఆ క్రేజ్ తెచ్చి పెడతాయి. ఇప్పటికే కన్నడ భామ రష్మిక టాలీవుడ్ టు బాలీవుడ్ తన సత్తా చాటుతుంది. ఇక ఇప్పుడు అదే దారిలో కొత్త హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సప్త సాగరాలు దాటి సినిమా తో సౌత్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టిన రుక్మిణి వసంత్ తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇస్తుందని భావించగా నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ వచ్చింది.

సినిమా కోసం రుక్మిణి పెద్దగా ప్రమోషన్స్ చేసింది కూడా లేదంటే సినిమా ఎప్పుడో కమిటైనట్టు అర్ధమవుతుంది. ఈమధ్యనే బఘీర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుక్మిణి ఆ సినిమాతో కూడా మంచి ఫలితాన్ని అందుకోలేదు. ఐతే రుక్మిణి ఖాతాలో సక్సెస్ లేకపోయినా ఆమె మాత్రం సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ముఖ్యంగా రుక్మిణి లోని మిమిక్రీ టాలెంట్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది.

తనలో ఉన్న యూనిక్ క్వాలిటీ ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఒక విషయాన్న్ని చెప్పమని రుక్మిణిని అడిగితే ఆమె తాను మేకలా అరుస్తానని చెప్పింది. మేకలా రుక్మిణి అరవడం చూస్తే మరో మేక తప్పకుండా ఇది మన జాతి వాళ్లు అరచినట్టు ఉందే అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ గా మేకలా డిటో అరిచేస్తుంది రుక్మిణి. కచ్చితంగా అమ్మడు ఇలా మేకలా అరవడం కొన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టే ఇంత పర్ఫెక్ట్ గా అంటుందని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగులో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో ఆమె నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం రుక్మిణి దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు. మరి నిజంగానే తారక్ తో రుక్మిణి జత కట్టే ఛాన్స్ ఉందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: