ఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లయ గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. అప్పట్లో తెలుగు లో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ .. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన లయ .. భద్రం కొడుకు అనే సినిమా తో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది .. ఈ సినిమా తర్వాత స్వయంవరం , ప్రేమించు , మనోహరం , మనసున్న మారాజు , హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ . అయితే ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో ఉంటున్నారు ..


ఇక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంది . అయితే గతంలో హీరోయిన్ లయ ను ఒకప్పటి టాలీవుడ్ నటుడు సాయి కిరణ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట . ఇదే విషయాన్ని సాయికిరణ్ గతం లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పవచ్చారు . ఈ సాయి కిరణ్ లయ కాంబినేషన్లో ప్రేమించు అనే సినిమా కూడా వచ్చింది .. ఈ సినిమా లో లయ కళ్ళులేని అమ్మాయి పాత్ర లో కనిపిస్తుంది .. కాగా ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారట ..


అలాగే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట . కానీ సాయి కిరణ్ లయ‌ జాతకాలు కలవలేదని వీరి పెళ్లి కి ఇంట్లో వారు ఒప్పుకోలేదట . దాంతో సాయి కిరణ్ , ల‌య మంచి స్నేహితులు గానే మిగిలిపోయారు . అయితే ప్రస్తుతం సాయి కిర‌ణ్‌ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు .. ప్రస్తుతం బుల్లితెర పై బిజీగా ఉన్న సాయి కిరణ్ తనతో కలిసి నటించిన న‌టిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . దాంతో ఆయన కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: