అయితే కరెక్ట్ గా ఇదే మూమెంట్లో బన్నీ అన్ స్టాపబుల్ షోకి వచ్చిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్ . కాగా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అందరూ అనుకున్నట్టే పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ.. బాలయ్య హౌస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా హాజరయ్యారు . కాగా ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన చాలా డీటెయిల్స్ ని అడిగి తెలుసుకున్నాడు బాలయ్య . కాగా "నేషనల్ అవార్డు రాగానే ఆనందం ఎలా ఉంది ..? అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి..?" అంటూ ప్రశ్నించారు. ఒకే ఒక్క మాటతో బన్నీ ఆన్సర్ ఇచ్చాడు .
"నేషనల్ అవార్డు మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి వచ్చింది అని నేను సెర్చ్ చేసి చూస్తే ఒక్కరు కూడా లేరు సార్ ..అప్పుడే డిసైడ్ అయ్యా కొట్టాలి..ఎలాగైన కొట్టాలి.. రౌండ్ గీసుకొని మరి ఫిక్స్ అయ్యా అప్పుడే ఆ అవార్డు కొట్టాలి అంటూ డిసైడ్ అయ్యా " అంటూ ప్రోమోలో చెప్పుకొచ్చాడు . దీనితో సోషల్ మీడియాలో ఈ ప్రోమో బాగా హైలైట్ గా మారింది . అయితే కొంతమంది బన్నీ మాటలను చాలా పాజిటివ్ గా తీసుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు .
అంటే మీ కన్నా తోపైనా మగాడు ఇండస్ట్రీలోనే లేడు అనుకున్నావా..? అంతకుముందు చాలామంది స్టార్ యాక్టర్స్ నటించారు.. చాలా పెద్ద అవార్డ్స్ కూడా తీసుకున్నారు..? మరి వాళ్ళందరు హీరోలు కాదా? బాలయ్య అడిగిన ప్రశ్న ఏంటి..? నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంటి ..? అంటూ మండిపడుతున్నారు . మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గొడవలు జరుగుతున్న మూమెంట్లో బన్నీ చేసిన ఈ కామెంట్స్ మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేలా ఉన్నాయి అంటున్నారు జనాలు . బన్నీ చాలా సైలెంట్ గా ఉన్నా కూడా కావాలని కొంతమంది గెలుకుతూ బన్నీని నెగిటివ్గా సృష్టిస్తున్నారు అంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు..!