ప్రస్తుతం సినిమాలు చూసే ప్రేక్షకుడి ఆలోచన ఎంతో మారిపోయింది. రొటీన్ రొట్ట కథలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు ప్రెక్ష‌క‌కుల ముందుకు వచ్చే సినిమాలు సక్సెస్ సాధించాలంటే మాత్రం ఎంతో కొత్తదనం కొత్త కథలు చేసే ప్రయత్నం అయితే చేయాలి.  అలా చేయకపోతే మాత్రం సినిమాల కు కాలం చెల్లితుందని చెప్పాలి . అందుకే చిత్ర పరిశ్ర‌మ‌లో కొంత మంది డైరెక్టర్లు రెగ్యులర్ కథలు కాకుండా గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న స్టోరీలను ఎంచుకొని ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . అందుకే అలాంటి దర్శకులకు చిత్ర పరిశ్రమ లో ఎక్కువ అవకాశాలు రావడంతో పాటు వారి క్రేజ్ కూడా భారీగా పెరుగుతుంది.


ఇక ప్రస్తుతం రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆయనకు జాతీయస్థాయిలో గుర్తింపురావడమే కాకుండా తనను మించే దర్శకుడు మరొకరు లేరు అనేలా గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇప్పుడు ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరకడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అని కూడా అంటున్నారు. రాజమౌళి తర్వాత అదే స్థాయిలో గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ లో త‌నుకొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ దర్శకల్లో ప్రశాంత్ వర్మ కూడా ఇప్పుడు అతి తక్కువ బడ్జెట్లో భారీ గ్రాఫిక్స్‌ సినిమాలను చేయడానికి రెడీ అవుతున్నాడు.


ప్రశాంత్ నుంచి వచ్చే సినిమాల పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ .. తను చేయబోయే తర్వాత సినిమాల్లో కూడా గ్రాఫిక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకొని ముందుకు  వెళుతున్నాడు. ఇలా రాజమౌళి - ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ లోనే అగ్ర దర్శకులుగా దూసుకుపోతున్నారు. వీళ్లిద్దరి సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: