కాగా బాలయ్య సైతం తనదైన స్టైల్ లో బన్నీని రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ నాటి ఆన్సర్స్ రాబట్టడానికి బాగా ట్రై చేశారు . ఇదే క్రమంలో అల్లు అర్జున్ తల్లిని నిర్మలమ్మ గారిని కూడా షోకి ఆహ్వానించారు . ఆమె ఎంట్రీ లెవెల్ హైలెట్ గా మారింది . చాలా కూల్ గా చాలా తెలివిగా ఆన్సర్ చేశారు అంటూ జనాల మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యంగా" అల్లు అర్జున్ ఎప్పుడైనా దిగాలుగా కూర్చొని బాధపడుతున్న సందర్భంలో మీరు వెళ్లి ఓదార్చారా..?" అంటూ బాలయ్య అడగగానే బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాడ్ మ్యూజిక్ ఎమోషనల్ మ్యూజిక్ ప్లే అవుతుంది.
అప్పుడు నిర్మలమ్మ గారు తన వర్షెన్ ని వినిపిస్తారు . ఇది ప్రోమోలో కట్ చేశారు . డైరెక్ట్ ఎపిసోడ్ లోనే టెలికాస్ట్ అవుతుంది . అప్పుడే ఆన్సర్ ఏం ఇచ్చిందో తెలుస్తుంది. అయితే ఈలోపే బన్నీ ఫాన్స్ చాలా చాలా ఊహించేసుకుంటున్నారు. అల్లు అర్జున్ దిగాలుగా కూర్చుని సాడ్ గా ఉన్న మూమెంట్ కచ్చితంగా ఇదే గెస్ చేస్తున్నారు . పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని దుష్ట శక్తులు కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు . బహుశా అల్లు అర్జున్ తను ఇంత కష్టపడి నటించిన సినిమా వేరే వాళ్ళ కోసం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ బాధపడి ఉండొచ్చు అని బన్నీ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు . అసలు బన్నీ వాళ్ళ అమ్మగారు ఏం ఆన్సర్ ఇచ్చారు..? బన్నీ ఎందుకు డల్ గా కూర్చొని ఆలోచించాడు..? తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే..!