కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కడం మాత్రమే కాకుండా ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు చాలా తక్కువ రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి.

దానితో ఈ సినిమాకు సంబంధించిన చాలా ఈవెంట్లలో ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సుకుమార్ కనిపించలేదు. ఆయన ఈ సినిమా విడుదలకు చివరి నిమిషం వరకు ఏదో ఒక పనులు చేస్తూనే బిజీగా ఉన్నాడు. దానితో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా విడుదల చేసిన దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో ప్రమోషన్లను చేయలేదు. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు.

దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసి ఈ మూవీ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి వరకు ఏ ఈవెంట్లలో కూడా పాల్గొనే అవకాశం లేదు అని తెలుస్తుంది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సారి కూడా చాలా తక్కువ రోజులు మాత్రమే ప్రమోషన్లను దేశ వ్యాప్తంగా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే కానీ జరిగితే ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa