ఈ మధ్యకాలంలో సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. రీసెంట్ గా సమంత, వరుణ్ ధావన్ కలిసి జంటగా నటించిన సిరీస్ సిటాడేల్: హనీ బన్నీ. ఈ సిరీస్ గురువారం రోజున అంటే రెండు రోజుల కిందటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో స్టార్ నటులు సమంత వరుణ్ ధావన్ నటించారు. ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్ కు సంబంధించి ప్రమోషన్లను కూడా భారీగానే నిర్వహించారు.
దానికి తగినట్టుగా వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఇందులో సమంత, వరుణ్ ధావన్ మధ్య లిప్ లాక్ సీన్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా సమంత ఇందులో బోల్డ్ సీన్లలో నటించింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయట. ప్రస్తుతం సమంతకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ వీడియో రిలీజ్ అయిన అనంతరం నాగచైతన్య ఓ సంచలనం నిర్ణయాన్ని తీసుకున్నాడుట. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తన సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త తక్కువగానే ఉంటాయి.
అయితే సమంతను ఇలా చూసిన తర్వాత నాగచైతన్య కూడా తన సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయం తెలిసి కొంతమంది విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎలాంటి సీన్లలో నటిస్తే నీకేంటి అంటూ నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. తన లైఫ్ తాను చూసుకుంటుంది నీ లైఫ్ నువ్వు చూసుకో అంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.