గ్లోబల్ స్టార్  రాంచరణ్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా మొదలై దాదాపు నాలుగేళ్లు గడిచిపోయింది.. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎంతో గ్రాండ్ గా మొదలైన ఈ సినిమాకు ఆది నుంచి కష్టాలు వచ్చి పడుతూనే వున్నాయి..ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ శంకర్ భారతీయుడు కమిట్మెంట్స్ కారణంగా అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రచారం జరిగిన ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ ప్రకటించారు… ఈ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి ఇక నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి..తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. లక్నోలోని ప్రతిభ థియేటర్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్, కియారా అద్వానీ టీజర్ లాంచ్ ఘనంగా నిర్వహించారు.

 విడుదల అయిన ఈ టీజర్ మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు ఎంతో రిచ్ గా తెరకెక్కించారు..ఈ సినిమా కోసం దిల్ రాజు పెట్టిన ప్రతి రూపాయిని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసాడు దర్శకుడు శంకర్.. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రభుత్వ అధికారిగా అలాగే మరో మాస్ క్యారెక్టర్ లో కూడా కనిపించబోతున్నట్లు మేకర్స్ టీజర్ లో హింట్ ఇచ్చారు. టీజర్ ని గమనిస్తే గేమ్ ఛేంజర్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది...ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్జె సూర్య, నవీన్ చంద్ర వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.. అయితే భారతీయుడు 2 ప్లాప్ అవ్వడంతో శంకర్ సినిమాలపై చరణ్ ఫ్యాన్స్ నమ్మకం కోల్పోయారు.. అయితే తాజాగా రిలీజ్ అయిన టీజర్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ లో మళ్ళీ అంచనాలు మొదలయ్యాయి.. టీజర్ లో చరణ్ చెప్పే డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా శంకర్ రాసుకున్నారు. ముఖ్యంగా నేను ఊహాతీతం అంటూ ఇంగ్లీషులో రామ్ చరణ్ చేత చివర్లో చెప్పించిన డైలాగ్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: