ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కి ఇది ఒక బాగా అలవాటుగా మారిపోయింది . ఒక సినిమా మొత్తం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ మూడు కోట్లు లేదా నాలుగు కోట్లు . ఆ హీరోయిన్స్ స్ధాయి బట్టి ఉంటుంది . అయితే కేవలం ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మూడు నిమిషాలు చిందిలేస్తే కచ్చితంగా నాలుగు కోట్ల పైగానే రెమ్యూనరేషన్ ముట్టుతుంది.  ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.


ఇప్పటికే హీరోయిన్ శ్రీలీల  పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్ తో ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుంది. దీనికి సంబంధించిన క్రేజీ పిక్ సోషల్ మీడియాలో లీక్ అయి సంచలనంగా మారింది. లీక్ అయిన క్రేజీ పిక్ ఆధారంగా ఇది ఫుల్ టు ఫుల్ మాస్ ఫోక్ సాంగ్ తెలుస్తుంది . వీళ్ళ లుక్స్ ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాయి . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక హీరోయిన్ పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గౌరవం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కూడా ఐటమ్ సాంగ్ లో చిందులేయబోతుంది అన్న వార్త బాగా ఉపందుకుంది .



అయితే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుందట . టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే చూస్తారు. బాలీవుడ్ లో అలా కాదు అది ఒక సెన్సేషన్ . ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకునేందుకు ఐటమ్ సాంగ్ కూడా చేసేందుకు ఫిక్స్ అయ్యింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.  వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మృణాల్ ఠాకూర్ ఈ పాట చేస్తున్నందుకు గాను ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతుందట. కాగా తెలుగు లో మృనాల్ ఠాకూర్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: