మహేష్ బాబు.. ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఎంతలా అంటే ఇన్నేళ్ల ఆయన కెరీర్లు ఏ సినిమా కోసం కూడా ఈ రేంజ్ లో కష్టపడలేదు. మరీ ముఖ్యంగా 10 కేజీల బరువు తగ్గడమే కాకుండా ఆయన లుక్స్ మొత్తం కూడా మార్చేశాడు.  మహేష్ బాబు లుక్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎక్కువసేపు జిమ్ లోనే వర్కౌట్ చేస్తూ తన బాడీని ఇంకా మార్చేసుకుంటున్నాడు. ఇలాంటి క్రమంలోనే  మహేష్ బాబుకు సంబంధించిన ఒక వార్తను బాగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. ఎస్ఎస్ఎంబి 29 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.



అయితే కొంతమంది మాత్రం మహేష్ బాబు లో ఉన్న నెగిటివ్ ను బయటపెడుతున్నారు . ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది . మహేష్ బాబు చాలా సాఫ్ట్ హీరో . ఎలా అంటే సాఫ్ట్ గా ఉండే కధలని చూస్ చేసుకుంటూ ఉంటాడు . తొడ కొట్టడాలు.. మాస్ యాక్షన్ సినిమాలను చూస్ చేసుకోవడం చాలా చాలా రేర్.  అలాంటి సినిమాలు ఒకటో రెండో వచ్చినా కూడా అదంతా డైరెక్టర్స్ పుణ్యం అంటూనే మహేష్ బాబుని అలాంటి రోజుల్లో చూడగలిగాం.



అయితే మహేష్ బాబు కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్నాడు.  అది కూడా ఫైట్ సీన్స్ నటించడం ఇష్టం లేకనే అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.  ఆ సినిమా మరి ఏదో కాదు "వర్షం".  ప్రభాస్ కెరియర్నే మలుపు తిప్పిన వర్షం సినిమా ను ముందుగా సంతోష్ శోభన్.. మహేష్ బాబుకి వినిపించారట . కథ నచ్చిన కూడా యాక్షన్ సీన్స్ లో నటించలేను అంటూ ఓపెన్గానే ఈ సినిమాను రిజెక్ట్ చేసేసారట . ఆ తర్వాత ఈ స్టోరీకి ప్రభాస్ ఓకే అయ్యాడు . మహేష్ బాబు వదిలేసిన కథతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా తన రేంజ్ నే మార్చేసుకున్నాడు . ఇప్పుడు మహేష్ బాబు కన్నా కూడా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ పాపులారిటీ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు ప్రభాస్ . అప్పట్లో చాలామంది కూడా మహేష్ బాబు సాఫ్ట్ కథలకే సెట్ అవుతాడు అని యాక్షన్ పాత్రలకు ఆయన సెట్ చేయడం వేస్ట్ అని అలాంటి సినిమాలు డిజాస్టర్ గా మారుతాయి అని చెప్పుకొచ్చారు . అనుకున్నట్లే సైనికుడి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: