‘మహానటి’ ‘సీతారామం’ ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన దుల్కర్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలఎక్కువగా ఉంది. మీడియం రేంజ్ సినిమాలను తీసే దర్శక నిర్మాతలకు దుల్కర్ చిరునామాగా మారడంతో చాలామంది యంగ్ డైరెక్టర్స్ దుల్కర్ తో సినిమాలు తీయడానికి క్యూ కడుతున్నారు. అయితే దుల్కర్ మాత్రం తనకు నచ్చిన డిఫరెంట్ కథలను మాత్రమే ఎంచుకుంటూ తన క్రేజ్ ను పెంచుకోవడానికి గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు.
పూర్తిగా మనీ క్రైమ్ ఆధారంగా రూపొందిన ‘లక్కీ భాస్కర్’ ఇప్పటికీ 100 కోట్ల కలక్షన్స్ మార్క్ అందుకోలేక పోవడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ విడుదలై 10 రోజులు దాటిపోయినప్పటికీ ఇంకా 75 కోట్ల మార్క్ లోనే ఉంది అంటున్నారు. వాస్తవానికి ఈమూవీకి వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ ను ఆధారంగా చేసుకుని చాల సులువుగా ఈమూవీ 100కోట్ల మూవీగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనాలు వేశాయి.
అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీకి ‘అమరన్’ ‘క’ మూవీలు ఊహించని షాక్ ఇవ్వడమే కాకుండా ‘లక్కీ భాస్కర్’ కలక్షన్స్ కు ఈ రెండు సినిమాలు స్పీడ్ బ్రేకర్ గా మారడంతో దుల్కర్ 100 కోట్ల కల నెరవేరలేదు. అనుకోని ఈపరిణామానికి ఈమూవీ నిర్మాతలతో పాటు హీరో దుల్కర్ కూడ షాక్ అయినట్లు టాక్.
ఇది ఇలా ఉంటే దుల్కర్ కు టాలీవుడ్ లో వరసపెట్టి హిట్స్ వస్తూ ఉంటే మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రం అతడికి ఈ రేంజ్ లో హిట్స్ రావడం లేదు. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్న నేపద్యంలో దుల్కర్ కు మళయాళ ఫిలిమ్ ఇండస్ట్రీలో హిట్స్ తగ్గడం అతడి కెరియర్ కు మంచి కాదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు ఇతడి క్రేజ్ బాలీవుడ్ లో కూడ అంతంత మాత్రంగానే ఉంటోంది. మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమాల విషయంలో దుల్కర్ కొద్దిగా వెనకపడి ఉన్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..