ఇలాంటి పరిస్థితుల మధ్య బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ‘చావా’ ‘పుష్ప 2’ తో పోటీ ఎందుకని ఇప్పుడు వెనక్కు తగ్గడం హాట్ టాపిక్ గా మారింది. మరాఠా వీరుడు శంభాజీ బయోపిక్ గా రూపొందిన ఈ చారిత్రక మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈమూవీకి దాదాపు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు కూడ వచ్చాయి. 18వ శతాబ్ధంలో అలనాటి బ్రిటీష్ వారిని ఎదిరించిన యోధుడులో శంభాజీ ఒకడు.
ఈమూవీ చాల బాగా వచ్చింది అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఈమూవీలో కూడ రష్మిక హీరోయిన్ డిసెంబర్ 6న విడుదల కావలసిన ఈమూవీ ఇప్పుడు ఈ రేస్ నుండి తప్పుకుని జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జనవరి 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ విడుదల అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈమూవీ విడుదల అవుతున్నప్పటికీ విక్కీ కౌశల్ ఈపోటీని లెక్క చేయకుండా ఏకంగా చరణ్ తో పోటీ పడటం షాకింగ్ గా మారింది.
బాలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ‘పుష్ప 2’ తో పోల్చుకుంటే ‘చావా’ పై అంచనాలు మరీ తీవ్ర స్థాయిలో లేవు. దీనితో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ చాల పెద్ద సంచలనాలు చేయబోతున్నట్లే అనిపిస్తోంది. అయితే ఈమూవీ కథ మాస్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తు ఉండటంతో ‘పుష్ప 2’ కంటే ‘గెంచే ఛేంజర్ బెటర్ అన్న సంకేతాలు రావడంతో విక్కీ కౌశల్ ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకుని ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..