* అఖండలో బాలయ్య ద్విపాత్రాభినయం
* బోయపాటి - బాలయ్య కాంబినేషన్ లో అఖండ  
* వంద రోజులు ఆడిన చిత్రంగా రికార్డు
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. విభిన్న కథలతో సినిమాలు తీస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో డ్యూయల్ రోల్  సినిమాలు కూడా వచ్చి సక్సెస్ అందుకుంటున్నాయి.  స్టార్ హీరోలు కూడా డ్యూయల్ రోల్ చేసి సక్సెస్ అవుతున్నారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి బాలకృష్ణ చాలా సినిమాలలో డ్యూయల్ రోల్ చేశారు.  అందులో అఖండ సినిమా బంపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో అఖండ సినిమా వచ్చింది. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఈ మధ్యకాలంలోనే ప్రారంభమైంది. అయితే 2021 డిసెంబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా అఖండ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో భయంకరమైన అఖండ పాత్రలో బాలకృష్ణ నటించిన.... మరో బాలకృష్ణ అన్యాయాన్ని ఎదిరించే వాడిలా  కనిపించారు. ఈ సినిమా మొదటి పార్ట్ మొత్తం మురళీకృష్ణ పాత్ర ఎక్కువగా ఉంటుంది.

 ఎప్పుడైతే మురళీకృష్ణ పాత్ర ఆపదలోకి వెళ్తుందో.. అప్పుడే అఖండ రూపంలో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి సినిమా మొత్తం  అఖండ రూపంలో ఉన్న బాలకృష్ణ అనే కొనసాగిస్తాడు. ఇలా ఇద్దరినీ బ్యాలెన్స్ చేసుకొని.. బోయపాటి శ్రీను ఈ సినిమాను చాలా బ్రహ్మాండంగా తీశారు. దీంతో చాలా రోజుల తర్వాత ముఖ్యంగా కరోనా తర్వాత  100 డేస్  ఆడిన సినిమాగా అఖండ చరిత్ర సృష్టించింది.

 చాలా సెంటర్లలో.... వంద రోజులు ఆడి..  అఖండ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.  ఇటు ఓటిటీ లో కూడా సినిమా విజయవంతంగా నడిచింది. ఈ సినిమా కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చడంతో  అఖండ 2 కూడా తీస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.2025 డిసెంబర్లో... ఈ సినిమాను రిలీజ్ చేసే  ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: