•ఫ్లాప్ డైరెక్టర్లకి కూడా అవకాశం ఇచ్చే అంత గొప్ప మనసు..

•కళ్యాణ్ రామ్ ను అప్పుల బారి నుండి బయట పడేసిన ఎన్టీఆర్.

•ఎన్టీఆర్ మంచితనానికి అదే నిదర్శనం..

జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన ' జై లవకుశ ' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా చేసే సమయంలో చాలామంది నిర్మాతలు.. డైరక్టర్ బాబీ తో.. ఎన్టీఆర్.. నీతో సినిమా ఎందుకు చేస్తారని చాలా దారుణంగా మాట్లాడారట.. కానీ ఎన్టీఆర్ కి ధైర్యం చేసి కథ చెప్పిన తర్వాత ఎన్టీఆర్ కూడా బాగుందని చెప్పడంతో కాస్త ధైర్యం వచ్చిందని, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ ఆఫీసుకు పిలిపించి మరీ సినిమా చేస్తున్నామని చెప్పడంతో మరింత ఆనందం కలిగిందంటూ డైరెక్టర్ బాబి తెలియజేశారు. గతంలో ఎన్టీఆర్ హిట్ డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉండేది.కానీ ఫ్లాప్ డైరెక్టర్లకు కూడా అవకాశం ఇచ్చి సక్సెస్ చేస్తున్నారని వాటన్నిటికీ కూడా ఇదే జవాబు అంటూ డైరెక్టర్ బాబి తెలిపారు.


జై లవకుశ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి..72.90 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఇదే ఫైనల్ కలెక్షన్ అని కూడా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తుంటాయి. ఇందులో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. అందులో రావణ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా అంతా కూడా భారీ విజయాన్ని చేకూర్చేలా చేసింది. ఎన్నో ఆశలతో నిర్మాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించారు. అయితే కొన్ని సినిమాలను నిర్మించడం వల్ల చాలా నష్టాలను కూడా మిగిల్చుకున్నారట.


ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన కత్తి, హరే రామ్, ఓం త్రిడి, జయీభవ, ఇజం వంటి సినిమాలతో భారీ నష్టాలను చవిచూశారు కళ్యాణ్ రామ్ . దీంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ దాదాపుగా ఎత్తివేయాలనే సమయంలో పటాస్ సినిమా కాస్త ఊపిరి ఇచ్చింది. అయితే ఆ తర్వాత తన తమ్ముడు ఎన్టీఆర్ సపోర్టు తీసుకొని జై లవకుశ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నారు.  ఈ సినిమాకి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారని, అతి తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి తన తమ్ముడిని నష్టాలు భారీ నుంచి బయటికి వేసారని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ అప్పులన్నీ కూడా తీర్చేశారు. ఇక అక్కడినుంచి అటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య మంచి సన్నిహిత బంధం కూడా ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: