2006 సంవత్సరం జూన్ 23వ తేదీన... ఈ సినిమా రిలీజ్ అయింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో.... విక్రమార్కుడు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ సరసన అనుష్క శెట్టి... హీరోయిన్గా చేశారు. 10 కోట్లతో ఈ సినిమా తీస్తే... అప్పట్లోనే భారీగానే కలెక్షన్స్ తీసుకువచ్చింది విక్రమార్కుడు. ఈ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్... అనే పోలీసు పాత్రలో రవితేజ కనిపిస్తాడు.
అన్యాయాలను ఎదిరించడం, బాబుజి అనే విలన్ కు చుక్కలు చూపించడమే విక్రమ్ సింగ్ రాథోడ్ పని. అదే సమయంలో సత్తిబాబు పాత్రలో రవితేజ దొంగగా కూడా కనిపించి అందరిని మెప్పించాడు. బ్రహ్మానందంతో కలిసి... రవితేజ దొంగతనాలు చేస్తూ.... ఆ తర్వాత విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. విక్రమ్ సింగ్ రాథోడ్ ను ఎలా చంపారు..?
ఆయన కూతురుని అత్తిలి సత్తిబాబు ఎలా కాపాడాడు ? విక్రమ్ సింగ్ రాథోడ్, సత్తిబాబు ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు ? అనే విషయాలను రాజమౌళి చాలా చక్కగా తెరకెక్కించారు. అందుకే ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో రవితేజకు మొదటి హిట్ కావడం విశేషం. ఆ తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్ కాలేదు. ఈ సినిమాతో రవితేజ కెరీర్ కూడా మళ్లీ... దూసుకు వెళ్ళింది.