దీంతో టాప్ విలన్లను సైతం పక్కకు నెట్టి తమ సినిమాల్లో జగపతిబాబును పెట్టుకున్నారు ఎంతోమంది దర్శకులు. ఇక ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు అని చెప్పాలి. అయితే జగపతిబాబు అందరిలా కాదు కాస్త డిఫరెంట్. ఆయనకు నచ్చింది చేస్తాడు. నచ్చిందే మాట్లాడుతాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. అయితే ఇలాంటి జగపతిబాబు మూడు పెగ్గులు వేస్తే చాలు ఒక స్టార్ డైరెక్టర్ ని బండ బూతులు తిడతాడట. ఇక ఇలా ఇద్దరు కలిసి తాగిన ప్రతిసారి కూడా గొడవ జరుగుతుందట. ఇంతకీ జగపతిబాబు గొడవ పడే డైరెక్టర్ ఎవరో కాదు రాంగోపాల్ వర్మ.
జగపతిబాబు రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో అప్పుడెప్పుడో గాయం అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. అప్పుడు నుంచి మొదలైన వీరి ఫ్రెండ్షిప్ ఇప్పటికి కొనసాగుతుందట. వీరిద్దరూ ఖాళీగా ఉన్నారంటే చాలు సిట్టింగ్ వేసేస్తూ ఉంటారట. ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవి గురించి జగపతిబాబు మాట్లాడుతూ.. మేమిద్దరం కొట్టుకుంటాం. ఆయన తిక్కలోడు కదా.. ఏదో ఒకటి అంటాడు. నేను కూడా తిక్కలోన్నే కాబట్టి నేను ఏదో ఒకటి తిరిగి అంటాను. మూడు పెగ్గుల తర్వాత ఇద్దరం గొడవ పడతాం. గాయం సినిమా సమయంలో ఊర్మిళా నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకు అని అడిగితే.. నాకు ఆమెకు కెమిస్ట్రీ లేదు అందుకే ఇష్టం లేదు అని చెప్ప. అయితే నీకు ఇష్టమైతేనే సినిమా పూర్తి చేస్తానని ఆర్జీవి అన్నాడు. అప్పుడు నువ్వు కూడా ఇష్టం లేదు. నీకు శ్రీదేవి ఇష్టం కాబట్టి ఆమె కూడా ఇష్టం లేదు. సినిమా ఆపుకుంటే ఆపుకో అన్నాను. దీంతో ఇది నాకు నచ్చింది అన్నాడు ఆర్జివి. ఇలా మా మధ్య చాలా జరిగాయి అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు.