రాఖీసావంత్ మాజీ భర్త మైసూర్ కు చెందిన ఆదిల్ తన పైన మోసం, దొంగతనం, పరువు నష్టం ఇతర ఫిర్యాదులు చేశారని దీనివల్ల భారతదేశానికి వస్తే ఆమెను పోలీసులు అరెస్టు చేస్తారని అందుకే ఆమె దుభాయ్ లోనే ఉన్నదని అక్కడే నివాసం ఉంటున్నదంటూ రాఖీసావంత్ వార్తలేనిపిస్తున్నాయి. ఆమె డబ్బులు లేకపోవడం వల్లే అలా బిచ్చగత్తెగా మారిపోయిందనే విధంగా సమాచారం. ఇక్కడ ఎవరు ఎంత అడిగినా కూడా డబ్బులు కానీ సహాయం కానీ చేయలేదని తెలియజేసింది. తనకు భారతీయ చట్టం మీద నమ్మకం ఉన్నదని తిరిగి భారతదేశానికి వెళ్ళిపోతాను అంటూ తెలియజేసింది.
బాలీవుడ్ లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈమె సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి హీరోలతో నటించిన వారిని ఎందుకు సహాయం అడగలేదంటూ అక్కడ మీడియా ప్రశ్నించగా తాను ఎవరిని సహాయం అడగను ఇది తాను పోరాడే పోరాటం అని ఒక్క నిమిషంలో తనకు బెయిల్ ఇప్పించగలిగిన నటులు షారుక్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ కానీ అలా వద్దు నేను అలా చేయను ఈ యుద్ధంలో నేను మాత్రమే పోరాడుతానంటూ తెలియజేసింది రాఖీసావంత్. అదిల్ ఖాన్ ను రాఖీసావంత్ 2002లో వివాహం చేసుకున్నది. అలా వివాహమైన కొద్ది రోజులకే తన భర్త పైన రాఖి సావంత్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అతనిని లైంగిక వేధింపులు కేసు నమోదు కాక ఆ తర్వాత తన భర్త కొంతకాలం జైలు జీవితాన్ని కూడా గడిపారట. బయటకు వచ్చిన తర్వాత.. ఆదిల్ తన పైన దొంగతనం మోసం కేసులు పెట్టారని తెలియజేసింది.