కాగా అప్పటినుంచి నాగార్జున ఏ పని చేసిన సరే చాలా పక్కాగా ఆలోచించి చేస్తాడు అని అంతా అనుకున్నారు. సమంత - నాగచైతన్య పెళ్లి విషయంలో కూడా అలాగే అనుకున్నారు . నాగచైతన్య - సమంతను ప్రేమిస్తున్నాను అనగానే సమంత ను ఇంటి కోడలిని చేసుకోవడానికి ఏమాత్రం ఆలోచించలేదట . అయితే వాళ్లు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా బాధపడ్డారట . కానీ నాగచైతన్య చాలా చిన్న ఏజ్ కాబట్టి తనకు ఒక తోడు అవసరం ఉంటుంది కాబట్టి మళ్లీ పెళ్లి చేయాలి అంటూ అప్పుడే ఫిక్స్ అయ్యాడట . కానీ ఈసారి మాత్రం ఆయనను పక్కాగా అర్ధం చేసుకుని..నాగచైతన్య క్యారెక్టర్ కు తగిన అమ్మాయిని చూసి చేసుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట .
ఆ మూమెంట్ లోనే ఆయన ఫ్రెండ్ అయిన స్టార్ హీరో కూతురు ని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. చూడడానికి జంట బాగుంటుంది అని ఆశపడ్డారట. కానీ ఆ హీరో తన కూతుర్ని రెండో పెళ్లి వాడికి ఇవ్వను అంటూ చెప్పడంతో నాగార్జున ఆ పెళ్లి ప్రపోజల్ అక్కడితోనే ఆపేసారట. ఆశ్చర్యం ఏంటంటే ఆ తర్వాత ఆ హీరోయిన్ ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . ఒకవేళ నాగచైతన్య..ఆ హీరోయిన్ ని చేసుకుని ఉంటే ..అక్కినేని ఫ్యామిలీ క్రేజ్ రేంజ్ డబుల్ అయ్యుండేది. కానీ అప్పటికే నాగచైతన్య -శోభిత ధూళిపాళ్లను ప్రేమిస్తూ ఉండడంతో ఆ దేవుడే ఈ సంబంధాన్ని ఇలా చెడగొట్టాడేమో అని జనాలు మాట్లాడుకుంటున్నారు..!