కాగా పుష్ప వన్ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేత ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో ఉపేసాడో మనం చూసాం . ఇప్పటికీ ఈ పాటని పలు ఈవెంట్స్ లో పలు ఫంక్షన్స్ లో ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు యువతీ యువకులు . కాగా పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఏ హీరోయిన్ చేత చేయించబోతున్నాడు అంటూ యావత్ దేశం ఈగర్ గా వెయిట్ చేసింది. దానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర బృందం .
అయితే శ్రీలీల కంటే ముందే ఈ పాట టాప్ 3 హీరోయిన్స్ చేతికి వెళ్లిందట. వాళ్లు మరెవరో కాదు. సమంత అదే విధంగా అలియా భట్ అలాగే శ్రద్ధ కపూర్ . ఎస్ ఈ ముగ్గురు హీరోయిన్స్ చేతికి వెళ్లి ఆ పాట రిజెక్ట్ చేస్తేనే ఈ ఆఫర్స్ శ్రీలీల వద్దకు వచ్చిందట . హైలైట్ ఏంటంటే ముగ్గురు కూడా ఒకే ఒక కారణంతో ఈ పాటని రిజెక్ట్ చేయడం . సమంత పుష్ప 1 లో ఐటమ్ సాంగ్ చేసింది. పుష్ప 2 లో కూడా ఐటమ్ సాంగ్ చేయాలి.. చేస్తే బాగుంటుంది అంటూ సుకుమార్ రిక్వెస్ట్ చేయగా .. ఇక ఐటమ్ సాంగ్ చేయనే చేయను అంటు రిజెక్ట్ చేసిందట .
అలియా భట్ కూడా అంతే అసలు ఐటమ్ సాంగ్స్ లో నటించను అంటూ తెగేసి చెప్పిందట. శ్రద్ధ కపూర్ ది కూడా సేమ్ ఆన్సర్. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త మరొకసారి హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీని ఊపేసిన అలాంటి హీరోయిన్ ఐటమ్ సాంగ్ లో నటించము అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తే నిన్నకాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ మాత్రం డేరింగ్ గా ఆ పాటను ఓకే చేసింది . మరి ఆ పాటలో అంత మాయ ఏముందో ..? రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది . ఈ పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బన్నీ - శ్రీలీల ఫ్యాన్స్..!