మనకు తెలిసిందే పుష్ప 2 సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ తో ఒక సినిమాను ప్రకటించాడు సుకుమార్ . ఈ సినిమా రంగస్థలం 2 గా తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది . కానీ ఎక్కడ ఆఫిషియల్ ప్రకటన అయితే రాలేదు. పైగా సుకుమార్ పలు ఈవెంట్స్ లో మాట్లాడుతూ "నేను సినిమాలు చేస్తున్నంత కాలం సమంతనే హీరోయిన్ " అంటూ చాలా చాలా ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . దీంతో అందరూ ఈ సినిమాలో హీరోయిన్ సమంత ఫిక్స్ అయిపోయారు .
కానీ సుకుమార్ అదేవిధంగా రామ్ చరణ్ ఎక్కడ దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాగా రీసెంట్ గానే సమంత ఈ సినిమా అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట . ఖుషి సినిమాకి సైన్ చేసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ తీసుకొని మరి సమంత ఓకే చేసిన తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. చాలాకాలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ ను అదే విధంగా సమంతను కలిపి తెర పై చూడబోతూ ఉండడంతో ఫాన్స్ కూడా ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇక సుక్కు డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వేరే లెవెల్ లో ఉంటుంది . రంగస్థలం 2తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది సమంత అంటున్నారు సామ్ ఫ్యాన్స్..!