మనకు తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన సినిమా పుష్ప2. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయింది మూవీ టీం . ఈ క్రమంలోనే రిమైనింగ్ షూటింగ్ బ్యాలెన్స్ చకచక కంప్లీట్ చేసేస్తుంది. కాగా రీసెంట్గా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చాడు అల్లు అర్జున్ . ఇదే మూమెంట్లో బాలయ్య చాలా చాలా విషయాలను అడిగి తెలుసుకున్నాడు. బాగా నాటీ ఆన్సర్స్ కూడా రాబట్టాడు.
ఈ క్రమంలోనే.." మీకు బాగా కోపం తెప్పించే సందర్భం ఏది ..?"అంటూ అడగ్గా అల్లు అర్జున్ ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు . "అమ్మాయిల విషయంలో ఎవరైనా హద్దులు మీరితే ..నాకు చాలా కోపం వస్తుంది సార్ ..ఈ విషయం నేను ఎప్పుడు కూడా బయట చెప్పలేదు.. అమ్మాయిలను చాలా రెస్పెక్ట్ ఫుల్ గా గౌరవించాలి ..అదే నాకు ఇష్టం" అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొంతమంది ఈ వ్యాఖ్యలు పరోక్షకంగా జానీ మాస్టర్ ను ఉద్దేశించి చేశాడు అల్లు అర్జున్ అంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం "మీ ఇంట్లో పవన్ కళ్యాణ్ గురించి ఇలా మాట్లాడావా..?" అంటూ పరోక్షంగా ద్వద అర్ధాలు తీస్తూ పవన్ ని ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు. అల్లు అర్జున్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కు బిపి పెంచేస్తున్నాయి..!